కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda)లోని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్లు భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. టీజీఎస్పీడీసీల్, టీజీఎన్పీడీసీల్ పరిధిలో గత అనేక ఏళ్లుగా సేవలు అందిస్తున్న కార్మికులందరినీ తక్షణమే ‘ఆర్టిజన్లు’గా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్-మ్యాన్డ్, ఫిట్‌నెస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనవసరంగా ఆలస్యం చేస్తోందని వారు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని, విధులను బహిష్కరించి ఈ ధర్నాలో పాల్గొంటున్నట్లు వారు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో ఎస్ఈ కార్యాలయ ప్రాంతం జనసందోహంగా మారింది. తమకు రావాల్సిన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నాయకులు కోరారు.
Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!
Follow Us On: Instagram

