కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొన్ని చోట్లా యూరియా (Urea) కొరత ఉన్న విషయం తెలిసిందే. సకాలంలో యూరియా నిల్వలు అందక రైతులు సాగు చేసుకొని పరిస్థితి నెలకొంది. యూరియా కోసం రైతులు రొడ్డెక్కుతున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు (Minister Thummala) కేంద్ర రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేటాయించిన యూరియాలో మొదటి మూడు నెలల కాలానికి నెలకు 2 లక్షల చొప్పున సరఫరా చేయాలని తుమ్మల కోరారు.
ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ ఫలితాలపై జేపీ నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే దేశవ్యాప్త అమలుకు పరిశీలిస్తామని మంత్రి తుమ్మలకు నడ్డా (JP Nadda) తెలిపినట్టు తెలుస్తోంది.
Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!
Follow Us On: Instagram

