epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు.. ఎన్నికల వేల జోరుగా వలసలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ (Nizamabad) కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కప్పదాట్లు ఎక్కువయ్యాయి. ఆశావహులు, నాయకులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు మారుతున్నారు. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మీసాల శ్రీనివాస్ బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీసాల శ్రీనివాస్‌తో పాటు పార్టీలో చేరిన వారిలో దుంపల శ్రీను, కొండూరు గంగాధర్, ఈరోళ్ల ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ముత్యం రాకేష్, రాజేశ్వర్, డప్పు సాయి, మెండే గంగాధర్, సున్నపు భాస్కర్, మీసాల నవీన్ ఉన్నారు.

నిజామాబాద్‌ (Nizamabad)లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో, స్థానిక మాజీ కార్పొరేటర్ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో 4వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాంగ్రా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భీమ్ సింగ్, స్థానిక నాయకులు ఎల్‌ఐసీ శ్రీనివాస్ తదితరులు తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇటు కామారెడ్డిలో దేవునిపల్లికి చెందిన 34వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు లధూరి శ్రీనివాస్ యాదవ్, లధూరి రామ్ యాదవ్, లధూరి నాగార్జున యాదవ్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా అంతటా అన్ని మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ నాయకులు కండువాలు మార్చేస్తున్నారు.

Read Also: ఆధార్ వినియోగదారులకు షాక్.. పెరిగిన పీవీసీ కార్డు ధరలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>