Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. దంపతులు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. బైపాస్ చౌరస్తా వద్ద వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వలపు వల వేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, నాందేడ్‌కు చెందిన భార్యాభర్తలు పధకం ప్రకారం యువకులను టార్గెట్ చేస్తూ హనీ ట్రాప్ (Honey Trap) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బైపాస్ చౌరస్తా ప్రాంతంలో వాహనదారులను ఆకర్షించి, అనంతరం డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు దంపతులపై నిఘా పెట్టి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. హనీ ట్రాప్ ద్వారా పలువురు యువకులను మోసగించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>