Mobile Popup Ad
Mobile Popup Ad

అర్సపల్లి షార్ట్ సర్క్యూట్ బాధితులకు ఎమ్మెల్యే అండ.. ఆర్థిక సాయం అందజేత

కలం, నిజామాబాద్ బ్యూరో: షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన బీజేపీ నాయకురాలు మీరా వైచల్ కుటుంబానికి అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. ఇందూరు (Nizamabad) నగరంలోని అర్సపల్లిలో జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరా వైచల్ పిల్లల విద్యాభ్యాసానికి తనవంతు సాయం చేస్తానని భరోసా కల్పించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించారు. అనంతరం ధన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఆర్థిక సాయం అందజేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవారిలో ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్ మఠం పవన్, బీజేపీ నాయకులు గడ్డం రాజు, పవన్, బంటు ప్రవీణ్, మేధరి శేఖర్, హరీశ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>