కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ (Vijay) పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయ్ విక్టరీతో పాటు ఇదే సమయంలో విజయ్, త్రిష (Trisha) రిలేషన్ షిప్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగింది. ఎన్నికల ఫలితాలు త్రిష బర్త్ డే రోజు రావడంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల దాకా సోషల్ మీడియా వేదికగా త్రిషకు డబుల్ కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మరో బాలీవుడ్ నటి త్రిష, విజయ్ రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తరచూ తన చర్యలతో నెటిజన్లను ఎంటర్‌టైన్ చేసే రాఖీ సావంత్ (Rakhi Sawant) విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ చెప్పకొచ్చింది.
విజయ్ , త్రిషల ఆన్‌లైన్ కెమిస్ట్రీ చాలా బాగుందని, వాళ్లు పెళ్లి చేసుకుంటే వాళ్ల పెళ్లిలో మెహెందీ వేడుకకు హాజరవుతానని రాఖీ సావంత్ చెప్పింది. అలాగే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరాలని ఆసక్తిగా ఉన్నట్లు రాఖీ సావంత్ పేర్కొంది. విజయ్, త్రిషల మధ్య ఏదో ఉందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ ఓ వివాహ వేడుకకు కలిసి హాజరయ్యారు. అలాగే తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు త్రిష విజయ్ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు.

