కలం, నిజామాబాద్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రం చెన్నై నుండి బయలుదేరిన రాజీవ్ మెమోరియల్ జ్యోతి యాత్ర నిజామాబాద్ చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ ఇతర కాంగ్రెస్ నాయకులు (Nizamabad Congress) యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సేవలను దేశం గర్వంగా స్మరించుకుంటోందని చెప్పుకొచ్చారు. ఆయన పాలనలో టెలికమ్యూనికేషన్, సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాల్లో కీలక సంస్కరణలు చేపట్టి ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.
యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆధునిక భారత దేశ నిర్మాణానికి ఆయన దూరదృష్టి నేటికీ యువతకు ప్రేరణగా నిలుస్తోందనీ పేర్కొంటూ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, డిసిసి ఉపాధ్యక్షులు కౌడపు శరత్, మార్కెట్ డైరెక్టర్ రఘు పాల్గొన్నారు.
Read Also: తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?
Follow Us On: X(Twitter)

