కరీంనగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలి: సీపీఎం నేత‌ సత్యం

కలం, కరీంనగర్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) అన్నారు. ఆదివారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ సందర్శన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ అని, ఇది ఎండాకాలంలో చెత్త తగలబడి దట్టమైన పొగ వెదజల్లడం మూలంగా నగర ప్రజలు శ్వాసకోశ బాదిన పడుతున్నారని, వర్షాకాలంలో గుట్టలుగా ఉన్న చెత్త తడిచి దుర్వాసన వెదజల్లుతుందని దీని మూలంగా అలుగునూర్, అల్కాపురి కాలనీ, కట్టరాంపూర్, కోతి రాంపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లక్ష్మీ నగర్, గణేష్ నగర్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హ‌యాంలో బయోమైనింగ్ ద్వారా చెత్తను శుద్ధి చేస్తామని యంత్రాల కొనుగోలుకు 162 కోట్లు గుత్తేదారుకు కట్టబెట్టారని చెప్పారు. పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్ చేతులెత్తేశాడని, అతనిపై చర్యలు తీసుకోవడంలో నేటికీ అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బిజెపికి అధికారం ఇవ్వండి అన్నా, బిజెపికి ఓటు వేసి మేయర్ పదవి ఇవ్వండి అక్క ఒక్క నెలలో డంపింగ్ యార్డ్ ని తరలిస్తానంటూ జనాలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని నేటికి డంపింగ్ యార్డ్ తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas), కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికైనా నగర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తక్షణమే డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపి నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా డంపింగ్ యార్డ్ ను తరలించాలని లేదంటే నగర ప్రజలను ఐక్యం చేసి పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు కాంపల్లి అరవింద్, రాయికంటి శ్రీనివాస్, సన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>