తలనొప్పి ప్రదేశాల రహస్యాలు.. ఏ భాగంలో నొప్పి వస్తే ఏ సమస్యో తెలుసా?

కలం, వెబ్‌డెస్క్: తలనొప్పి (Headache) అనేది సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొనే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య. సమస్య సాధారణమైనదే అయినప్పటికీ నుదిటి నరాలు చిట్లిపోయేలా వచ్చే ఆ నొప్పి మన రోజంతటినీ నరకంగా మార్చేస్తుంది. అయితే తలనొప్పి అనేక రకాలుగా వస్తుంది (Types of Headaches). చాలామంది తలనొప్పి రాగానే మెడికల్ షాపుకు వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటారు. కానీ, ఆ టాబ్లెట్ తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుందేమో గానీ.. శరీరంలో ఉన్న అసలు సమస్యను నయం చేయలేదు.

అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది. మన తలలో ఏ ప్రదేశంలో వస్తుందనే దానిని బట్టి, మన ఆరోగ్యంలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందో అంచనా వేయవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం.

తలనొప్పి ప్రదేశాలు చెప్పే ఆరోగ్య రహస్యాలు

1. నుదుటి నొప్పి: ఇది ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పులు లేదా సైనస్ ఒత్తిడి పెరగడాన్ని సూచిస్తుంది.

2. కణతల నొప్పి: ఇది టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు, డీహైడ్రేషన్, లేదా పళ్ళు కొరకడం.

3. కళ్ళ వెనుక: కంటి ఒత్తిడి, గ్లాకోమా, లేదా కెఫిన్ మానేయడం వల్ల వచ్చే లక్షణాలు.

4. సైనస్ ప్రాంతం (ముక్కు/బుగ్గలు): సైనస్ ఇన్ఫెక్షన్, అలర్జీలు, లేదా జలుబు.

5. ఒక వైపు నొప్పి: మైగ్రేన్లు లేదా క్లస్టర్ తలనొప్పులు.

6. తల పైభాగం: కండరాల ఒత్తిడి, డీహైడ్రేషన్, లేదా సరైన భంగిమ లేకపోవడం.

7. దవడ నొప్పి: TMJ రుగ్మత, పళ్ళు కొరకడం, లేదా సైనస్ ఇన్ఫెక్షన్.

8. తల వెనుక భాగం (ఆక్సిపిటల్): ఆర్థరైటిస్, సరైన భంగిమ లేకపోవడం, లేదా నరాల మీద ఒత్తిడి.

9. మెడ మరియు తల కింది భాగం: సెర్వికోజెనిక్ తలనొప్పి, కండరాల ఒత్తిడి, లేదా ఆర్థరైటిస్.

Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>