కలం, నిజామాబాద్ బ్యూరో: సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేకాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో విజిట్ చేయాలని నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవి, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యం, సామాజిక సమస్యలు, మానసికపరమైన ఒత్తిడి అంశాలను తెలుసుకోవాలని ఆదేశించారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని చెప్పారు.
వచ్చే ఏప్రిల్ 01 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (Govt Office) ఈ-ఆఫీసులుగా మారాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిపాలనా పరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు. ఆన్‌లైన్ విధానంపై అవసరమైతే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్‌కు సూచించారు. ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాలల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించాలన్నారు. అలాగే స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ పూర్వ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే సోమవారం నాటికి మ్యాపింగ్ 70 శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.
Read Also: కేరళ అసెంబ్లీ ఫైట్.. బీజేపీ తొలి జాబితా విడుదల
Follow Us On: Instagram

