కేరళ అసెంబ్లీ ఫైట్.. బీజేపీ తొలి జాబితా విడుదల

కలం, వెబ్ డెస్క్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల (Kerala Elections) రణరంగం మొదలైంది. రాష్ట్రంలోని 140 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ (EC) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి హ్యాట్రిక్‌పై కన్నేయగా.. తిరువనంతపురం కార్పొరేషన్ విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ ఈసారి కేరళలో కాషాయ జెండా ఎగరవేయాలని ఉవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది.

తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల (Kerala Elections) తొలి జాబితాను బీజేపీ (BJP) విడుదల చేసింది. ఈ మేరకు 47 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల బరిలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలిచారు. ఆయన నేమమర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం బీజేపీ గెలిచిన సీటుగా ఉండడంతో మళ్లీ దానని చేజిక్కించుకోవాలని రాజీవ్ చంద్రశేఖర్ చూస్తున్నారు. కాగా, ఇప్పటికే అధికార వామపక్ష కూటమిలో కీలక పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం) 81 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి తన ప్రస్తుతం నియోజకవర్గమైన ధర్మదం నుంచి పోటీ చేయనున్నారు.

Read Also: HYD ప్రజలకు శుభవార్త.. వారికి 90 శాతం డిస్కౌంట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>