కలం, వెబ్ డెస్క్ : గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. జనవరి 30న ఢిల్లీలో మీటింగ్ మినిట్స్ నిర్వహిస్తే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని హరీష్ ఫైర్ అయ్యారు. మీటింగ్ మినిట్స్ లో గోదావరి జలాల్లో ఏపీకి నీటి కేటాయింపులు చేయలేదని కేఆర్ ఎంబీ చెప్పడం మహాదారుణం అన్నారు. సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టులోనే గోదావరిలో 1470 టీఎంసీలు ఉంటే.. ఇందులో ఏపీ వాటా 531 టీఎంసీలు అని అప్పుడే తేల్చారని.. కానీ కేఆర్ ఎంబీ పచ్చి అబద్దాలు చెబుతోందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
750 టీఎంసీల కోసం ఏపీ ప్లాన్..
ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే కనీసీం కాంగ్రెస్ సీఎం, మంత్రులు స్పందించట్లేదని హరీష్ ఫైర్ అయ్యారు. ‘మీటింగ్ మినిట్స్ లో ఏపీ 750 టీఎంసీలు తీసుకోవాలని ప్రయత్నించింది. ఆ కుట్రలో భాగంగానే గోదావరి జలాల్లో నీటి కేటాయింపులు లేవని కేఆర్ ఎంబీతో చెప్పించారు. ఇప్పటికీ 750 టీఎంసీలు తీసుకోవాలని ఏపీ పోరాడుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం రెస్పాండ్ కావట్లేదు. చంద్రబాబుకు ఏజెంట్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఇలా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు గోదావరి జలాల్లో ఉన్నాయని సీడబ్ల్యూసీనే తేల్చింది. కానీ ఆ హక్కులపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పోరాడట్లేదు’ అని హరీష్ ప్రశ్నించారు.
అతన్ని పంపడమే తప్పు
కేఆర్ ఎంబీ తన లిమిట్స్ దాటి వ్యవహరిస్తోందని.. కానీ సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కనీసం నోరు మెదపకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. తెలంగాణ నీటి వాటాల మీటింగ్ కోసం అడ్వయిజర్ గా ఆదిత్యదాస్ ను పంపడమే పెద్ద తప్పు అని.. తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ను పంపొద్దని తాము ఎంత చెప్పినా వినలేదని హరీష్ సీరియస్ అయ్యారు.
గవర్నర్ స్పీచ్ లో అబద్దాలు
‘మొన్న ఏపీ గవర్నర్ స్పీచ్ లో నల్లమల సాగర్ నీళ్లు ఏపీకి తీసుకెళ్తామని చెప్పారు. కానీ తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో మాత్రం దాన్ని అడ్డుకుంటామని లేకపోవడం అంటే.. ఇక్కడే ఏపీకి తెలంగాణ ప్రభుత్వం దాసోహం అయిందని తేలిపోతోంది. మేం గోదావరి నల్లమల సాగర్ నీళ్లు పోనివ్వబోమని తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఎందుకు లేదు. ఇవేవీ చెప్పకుండా గవర్నర్ స్పీచ్ లో పచ్చి అబద్దాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించింది’ అని హరీష్ రావు (Harish Rao) సీరియస్ అయ్యారు.
Read Also: ఏఐతో ఈ ఉద్యోగాలకు భయం లేదు !
Follow Us On : WhatsApp

