యాత్రికుల బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో బడా పహాడ్ దర్శనం కోసం వెళ్తున్న భక్తుల బస్సు బోల్తా పడింది. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా పహాడ్ శివారు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతానికి చెందిన సుమారు 35 మంది యాత్రికులు ఒక ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అటవీ మార్గంలోని ఒక మూలమలుపు వద్ద అకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్​ కావడంతో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి (Nizamabad Govt Hospital) తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు అక్కడ చికిత్స పొందుతున్నారు.

Read Also: ప్రైవేట్ స్కూల్‌ ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ట్టం చేయాలి: క‌విత‌

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>