అయోధ్య విరాళాల చోరీ కేసు: సిట్ సంచలన నివేదిక!

కలం, వెబ్ డెస్క్ : అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) విరాళాల చోరీ కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన సిట్ అధికారులు తమ తుది నివేదికను ఉత్తరప్రదేశ్ హోంశాఖకు అందజేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ నివేదికను త్వరలోనే రామమందిర్ ట్రస్ట్‌కు అప్పగించనున్నారు.

విరాళాల లెక్కింపు గది నుంచి ఏకంగా 70 సార్లు చోరీ జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పక్కా ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. చోరీ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, దానికి అనుగుణంగానే అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారని చంపత్ రాయ్ స్పష్టం చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ఈ కేసుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>