కొండాపూర్​ పబ్‌లో డ్రగ్స్ కలకలం: నటి హేమ రియాక్షన్​ ఇదే !

కలం, వెబ్ డెస్క్​ : హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న క్వాక్ ఏరీనా పబ్‌లో తాజాగా డ్రగ్స్ కలకలం రేగింది. పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా పబ్‌లో ఉన్న సుమారు 64 మందికి పోలీసులు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 64 మందిలో ఎనిమిది మందికి మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. వీరిలో ఆరుగురికి గంజాయి పాజిటివ్ అని రాగా, మరో ఇద్దరికి ఇతర డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ ఘటనపై నగరవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Actress Hema) పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ సమయంలో తాను కూడా పబ్‌లోనే ఉన్నట్లు ఆమె స్వయంగా ధృవీకరించారు. అయితే, దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. ఆ పబ్‌లో జరిగిన పార్టీకి తాను వెళ్లిన మాట వాస్తవమేనని, కానీ తనకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ, పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also:  బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?.. తాజా హింసతో చర్చలు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>