సర్వాయి పాపన్న ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం: గౌడ సంఘం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి (Dimmadurthy) గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలు, సమాజం కోసం అందించిన సేవలను స్మరించుకున్నారు.

గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన గొప్ప యోధుడని అన్నారు. ఆయన ఆశయాలు, ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ జయంతి వేడుకల్లో సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షులు రత్న గౌడ్, కోశాధికారి పొన్నం సురేందర్ గౌడ్, రమణ గౌడ్, నర్సా గౌడ్, రాజేశ్వర్ గౌడ్, రత్నా గౌడ్, మహేష్ గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>