epaper
Monday, March 2, 2026
epaper

బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం..

బీహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్(Nitish kumar) పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ(NDA) కూటమి ఘన విజయం సాధించింది. 243 స్థానాల్లో 202 స్థానాలను కౌవసం చేసుకుని తమ సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ బుధవారం గవర్న్‌కు తెలిపారు.

గురువారం ఉదయం సీఎం సహా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో నితీశ్‌(Nitish Kumar)తో పాటు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. సామ్రాట్ చౌదరీ, విజయ్ సిన్హాకు ఉప ముఖ్యమంత్రి హోదాలు లభించాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి కేంద్ర నాయకులు హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు.

Read Also: నాంపల్లి కోర్టుకు జగన్.. ఎయిర్ పోర్ట్ వద్ద కార్యకర్తల హల్‌చల్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!