Mobile Popup Ad
Mobile Popup Ad

నాంపల్లి కోర్టుకు జగన్.. ఎయిర్ పోర్ట్ వద్ద కార్యకర్తల హల్‌చల్

 అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా గురువారం వైసీపీ అధినేత జగన్(YS Jagan) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాగానే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో జగన్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. జగన్‌ వస్తున్నాడన్న సమాచారంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు కొందరు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపించారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కోర్టు పరిసరాల్లో కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు సమీప ప్రాంతాలకు వాహన రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

అక్రమాస్తుల కేసులో జగన్‌పై సీబీఐ(CBI), ఈడీ(ED) సంస్థలు గత పదిన్నరేళ్లుగా విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని కంపెనీలకు ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో లాభాలు కల్పించిన బదులు, ఆ సంస్థలు జగన్‌కు చెందిన వ్యాపార కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు పెట్టినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో జగన్ ఇప్పటికే 16 నెలలు జైళ్లో ఉండి వచ్చారు. ఈడీ కూడా మనీలాండరింగ్‌ కోణంలో విచారణ చేపట్టి, జగన్‌, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థల ఆస్తులను సీజ్ చేసింది.

ఇప్పటి వరకు సుమారు రూ.749 కోట్ల విలువైన స్థిరాస్తులు, షేర్లు, రియల్‌ఎస్టేట్‌ పెట్టుబడులు ‘ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్’గా గుర్తించి అటాచ్ చేసింది. పలు కంపెనీలు జగన్‌(YS Jagan) సంస్థలకు పెట్టుబడులుగా ఇచ్చిన నిధులు క్విడ్ ప్రోకో ఒప్పందాల భాగంగా వచ్చినవేనని ఈడీ వాదిస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదని తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో జగన్‌ విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

Read Also: స్వగ్రామానికి హిడ్మా మృతదేహం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>