epaper
Monday, March 2, 2026
epaper

వరల్డ్ కప్ ఫైనల్లో నిఖత్.. 20 నెలల తర్వాత..

ప్రపంచ బాక్సింగ్ ఛాపింయన్ షిప్(World Boxing Championship) ఫైనల్స్‌కు హైదరాబాదీ బాక్స్ నిఖత్ జరీన్(Nikhat Zareen) చేరుకున్నారు. దాదాపు 20నెలలుగా ప్రపంచ వేదికపై ఒక్కటంటే ఒక్క పథకం కూడా సాధించలేదు నిఖత్. దీంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా అభిమానలు ఆశలు అడియాశలే అన్న తీరులో ఉన్నారు. కాగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఫైనల్స్‌కు చేరుకుంది నిఖత్. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్‌కి అర్హత సాధించిన ఆమె, కనీసం రజత పతకాన్ని సొంతం చేసుకున్నట్టే.

ఎన్నో నెలల తర్వాత మళ్లీ పతకం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది నిఖత్. ఇప్పుడు తాను తిరిగి తన బెస్ట్ ఫామ్‌లో ఉన్నానని అనిపిస్తోందని చెప్పింది. అభిమానుల మధ్య ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచానని, ఈ టోర్నీలో కూడా ఫైనల్‌కు వచ్చానని వివరించింది. ఈసారి స్వర్ణం సాధిస్తానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేసింది.

మహిళల 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్(Nikhat Zareen) ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గనీవా గుల్సెవర్‌పై అద్భుత ప్రదర్శన చేసింది. జడ్జీలు ఏకగ్రీవంగా నిఖత్‌ను విజేతగా ప్రకటించడంతో ఆమె ఫైనల్‌కు అడుగుపెట్టింది. తుది పోరులో నిఖత్ గువో జి జువాన్‌ (చైనీస్ తైపీ)ను ఎదుర్కోనుంది. నిఖత్‌తో పాటు మరికొందరు భారత బాక్సర్లు కూడా ఫైనల్‌కు చేరి అదరగొట్టారు.

57 కేజీల సెమీఫైనల్లో జాస్మిన్ సర్సెన్బెక్‌ (కజకిస్థాన్)పై 5-0 తేడాతో గెలిచింది.

జాదుమణి సింగ్ (57 కేజీలు)

పవన్ బర్త్వాల్ (55 కేజీలు)

సచిన్ సివాచ్ (60 కేజీలు)

హితేశ్ గులియా (70 కేజీలు)

వీరు తమ తమ వర్గాల్లో ఫైనల్లోకి ప్రవేశించి భారత విజయావకాశాలను మరింత పెంచారు.

Read Also: రెండో టెస్ట్‌కు శుభ్‌మన్ దూరం..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!