Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిట్‌నెస్ లేదు.. సేఫ్టీ లేదు: నిర్మల్ జిల్లాలో బస్సుల సీజ్!

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్మల్, బైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న ఐదు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) తిరుపతి, బైంసా, ఖానాపూర్ పట్టణాల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (AMVI) రజనీకాంత్, అసిఫ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా పలు బస్సుల పత్రాలు, భద్రతా ప్రమాణాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులను రవాణా చేసే ప్రతి బస్సుకు తప్పనిసరిగా రవాణా శాఖ జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకునే ఓవర్‌లోడ్ బస్సులు, భద్రతా నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి రాజీ ఉండదని, స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. జిల్లాలో తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>