Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారంలోకి వస్తాం.. అండర్ గ్రౌండ్ మైనింగ్ తెరుస్తాం: కవిత

కలం, వెబ్ డెస్క్: సింగరేణిలో చాలా మంది స్కిల్డ్ కార్మికులు ఉన్నారని.. సంస్థను చాలా బాగా నడిపే పరిస్థితి ఉన్నప్పటికీ యాజమాన్యానికి ఆ మనసు రావటం లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత (Kavitha) మండిపడ్డారు. కార్మికుల కోసం పోరాటం చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందిస్తారని ఇక్కడకు వచ్చామన్నారు. కిషన్ రెడ్డి ఇప్పుడు బొగ్గు శాఖ మంత్రిగానే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్న శ్రీరాంపూర్ RK7 మైన్ ను కూడా మూసేసే ప్రయత్నం చేస్తే కార్మికులు అడ్డుకొని కాపాడుకున్నారని చెప్పారు. మన గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు మనకే కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. కోల్ బ్లాక్స్ కోసం సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే పరిస్థితి లేకుండా చేయాలని.. తమకు ఎక్కువ బ్లాక్ కేటాయించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేయాలని చెప్పారు. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని.. అండర్ గ్రౌండ్ మైనింగ్ ను తెరుస్తామని వ్యాఖ్యానించారు. దాని ద్వారా లక్ష మంది ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.

సింగరేణి లాభాల్లో కార్మికుల (Coal Workers) ఇచ్చే వాటా విషయంలోనూ మోసం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలను సగానికి పైగా దాచేస్తున్నారని.. అందుకే తాను ఒక ప్రతిపాదన పెడుతున్నానన్నారు. గతంలో అత్యధికంగా వాటా ఇచ్చిన దానికన్నా పదివేలు ఎక్కువ ఇవ్వమని కోరుతున్నట్లు ప్రతిపాదించారు. లాభాల్లో 42 శాతం వాటా అంటే కూడా మన అకౌంట్లోకి తక్కువ డబ్బులు వస్తాయని అన్నారు. అలియాస్ పేర్ల విషయంలో కూడా కేసులు పెడుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను వేధించవద్దని కోరుతున్నట్లు చెప్పారు. అలియాస్ పేర్ల అంశంపై కూడా తాము పోరాటం చేస్తున్నామన్నారు. మైన్ మీటింగ్ లు పెట్టుకోవటం కార్మికుల హక్కు అని.. దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ అవినీతి లేని కార్మికుల కోసం పోరాటం చేసే నాయకులు అని.. ఆయనతో కలిసి టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను, హెచ్ఎంఎస్ ను ఆశీర్వదించాలని కార్మికులను కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>