Mobile Popup Ad
Mobile Popup Ad

SIR ఫామ్స్‌ని వెంటనే ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలి: నిర్మల్ కలెక్టర్

కలం, నిర్మల్: ఎస్ఐఆర్ ఫామ్స్‌ని ఆన్‌లైన్‌లో వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అన్నారు. గురువారం బాసర, తానూర్, కుబీర్, మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా బాసరలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. గడువులోగా ఫామ్స్‌ స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తైన ఎస్ఐఆర్ ఫామ్స్‌ డిజిటలీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్లకు సహాయం చేయాలన్నారు. సూపర్వైజర్లు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

అనంతరం తానూరు మండలం సింగన్ గావ్, కుబీర్ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన డిజిటలైజేషన్ ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్‌లో వివరాలను పరిశీలించారు. సమీపంలోని ఓటర్ ఇంటికి వెళ్లి, వారు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారో లేదో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు పవన్ చంద్ర, మహేంద్రనాథ్, శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్‌లు వెంకటేశ్ గౌడ్, అన్నపూర్ణ, సాయినాథ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>