కవిత ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలి: ధర్మపురి అర్వింద్‌

కలం, నిజామాబాద్ బ్యూరో: స్వయంగా కేసీఆర్ కుటుంబసభ్యురాలు, ఇంటి మనిషి కవిత (Kavitha) బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావుల మీద చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణల మీద సీబీఐ చేత వెంటనే విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (Dharmapuri Arvind) సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ అభిప్రాయ పడ్డారు.

ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్‌ని రక్షించార‌న్నారు.

ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారని, కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్వింద్ సీఎంను డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>