కలం, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ (Bandi Bhagirath) కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ తరఫున దాఖలైన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను గురువారం విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం వెలువరించింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.లక్షతో రెండు పూచికత్తు సమర్పించడంతో పాటు.. సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారి చేసింది.
మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించాడనే ఆరోపణలతో బండి భగీరథ్ (Bandi Bhagirath) పై మే 16న పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుకు సంబంధించి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. గురువారం విచారించిన న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

