Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మికుడి మృతి.. సారపాక ఐటీసీలో ఉద్రిక్తత

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక (Sarapaka) ఐటీసీ పీఎస్‌పీడీ కర్మాగారంలో బుధవారం గుండెపోటుతో వరికూటి నరసింహారావు అనే కాంట్రాక్ట్ కార్మికుడు మరణించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిన్నటి నుంచి చేపట్టిన నిరసన రెండో రోజూ కొనసాగుతోంది.

గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు పోరుబాట పట్టారు. సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి గుగులోతు కిషోర్ శివరామ్ నాయక్ నేతృత్వంలో పాలకవర్గ సభ్యులు నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి ఒప్పందం ప్రకారం అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు యాజమాన్యం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే..

​ఈ సందర్భంగా కిషోర్ శివరామ్ నాయక్ మాట్లాడుతూ.. కంపెనీనీ నమ్ముకుని జీవిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలకు కనీస భరోసా కల్పించడంలో యాజమాన్యం కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇద్దరు చిన్న పిల్లలతో కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాన్ని ఆదుకునే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

సర్పంచి స్వయంగా దీక్షకు కూర్చోవడంతో సీపీఎం నాయకులు, స్థానిక కార్మికులు ప్రజలు భారీ సంఖ్యలో ఐటీసీ ప్రధాన గేట్ వద్దకు తరలివచ్చారు. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>