కలం, వెబ్ డెస్క్ : హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మరోసారి ప్రభాస్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్, నిధి కలిసి నటించిన ది రాజాసాబ్ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా మూవీ ప్రమోషన్లు చేస్తోంది నిధి. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొంది. ‘నేను రాజసాబ్ షూటింగ్ రోజులను అస్సలు మర్చిపోలేను. మరీ ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) గురించే చెప్పాలి. ఆయన చేసే అతిథి మర్యాదలు మామూలుగా ఉండవు. నేను నా లైఫ్ లో అంత మంచి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఎవరినీ ఇబ్బంది పెట్టరు’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
ఇక తన లైఫ్ లో కూడా ఎన్నో ఆశలు ఉన్నాయని.. వాటి కోసమే ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. తాను కూడా సమాజ సేవ చేస్తానని.. కాకపోతే బయటకు చెప్పుకోవడం ఇష్టం లేదని వివరించింది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో మరికొన్ని సినిమాలకు సైన్ చేశానని.. వాటి గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తానని వివరించింది. రాజాసాబ్ అందరికీ నచ్చేలా చేశామని, మారుతి డైరెక్షన్ లో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పింది. ఆమె (Nidhhi Agerwal) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: దృశ్యం-3లో డైరెక్టర్, హీరో మధ్య డిఫరెన్స్
Follow Us On: X(Twitter)


