epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దృశ్యం-3లో డైరెక్టర్, హీరో మధ్య డిఫరెన్స్

కలం, వెబ్‌డెస్క్: దృశ్యం-3లో (Drishyam 3) కథ ఏ మలుపు తీసుకుంటుందా! అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కథలో ఏమో కానీ ఈ మూవీ రియాల్టీలో ఊహించని మలుపు తీసుకుంది. ఆఖరి నిమిషంలో సినిమాలో నటించడం నా వల్ల కాదు అంటూ కీలక నటుడు చేతులెత్తేశాడు. ఇందుకు కారణం ఏంటో తెలుసా. . ఒక విగ్. అవును.. విగ్తెచ్చిన తంటా దెబ్బకి సినిమా ఊహించని మలుపు తీసుకుంది. కీలక నటుడు మారిపోయాడు. ఇంతకీనటుడు ఎవరంటే.. అక్షయ్ ఖన్నా. అవును.. దృశ్యం-3  నుంచి అక్షయ్ ఔట్ అయ్యాడు. షూటింగ్దాదాపు మొదలైపోయింది అన్న సమయంలో అక్షయ్.. తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడంతో డైరెక్టర్, అతడి మధ్యలో వివాదం మొదలైంది. పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేలా మారింది.

క్రమంలోనే దృశ్యం-3లో (Drishyam 3) అక్షయ్ ఖన్నా ప్లేస్‌లో జైదీప్ అహ్లవత్ నటించనున్నట్లు నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ ప్రకటించాడు. అన్‌ప్రొఫెషనల్‌ పద్దతి వల్లే అక్షయ్‌ను తొలగించినట్లు చెప్పాడు. త్వరలోనే అక్షయ్ ఖన్నాపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు చెప్పాడు. అయితే అసలు వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిన విగ్ విషయం ఏంటంటే.. తాజాగాఇంటర్వ్యూలో కుమార్ మంగత్విషయాన్ని వెల్లడించారు. ‘‘దృశ్యం-3కి అంతా సెట్ అయింది. అక్షయ్ ఖన్నా.. అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశాడు. చాలా నెగోషియేషన్స్ తర్వాత అతడి ఫీజ్ కూడా ఫిక్స్ అయింది. ఆ నెగోషియేషన్స్ సమయంలోనే తాను విగ్ పెట్టుకుంటానని అక్షయ్ చెప్పాడు. కానీ అది ప్రాక్టికల్‌గా సెట్ అవదని, సినిమా దృశ్యం-2కి సీక్వెల్ కాబట్టి కంటిన్యుటీ తేడా వస్తుందని వివరించి ఒప్పించా. అతడు కూడా అర్థం చేసుకుని ఒప్పుకున్నాడు. కానీ అతడి చుట్టూ ఉన్న చెంచాలు మాత్రం.. విగ్ పెట్టుకుంటే అక్షయ్ ఇంకా స్మార్ట్‌గా ఉంటాడని సలహాలు ఇచ్చారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మళ్ళీ విగ్ పెట్టుకుంటానంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు అక్షయ్ ఖన్నా. విషయంపై మళ్ళీ చర్చించడానికి డైరెక్టర్ అభిషేక్ పాఠక్ రెడీ కూడా అయ్యాడు. ఇంతలో తాను ప్రాజెక్ట్ నుంచి తప్పకుంటున్నా అంటూ అక్షయ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు’’ అని కుమార్ వివరించాడు.

లీగల్ యాక్షన్ తీసుకుంటా
అక్షయ్ ఖన్నా ప్రవర్తన వల్ల తాను చాలా నష్టపోయానని చెప్పాడు పాఠక్. ఈ విషయంలో తాను ఖన్నాపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నాడు. ఇప్పటికే అతడికి అక్షయ్‌కి లీగల్ నోటీసులు పంపానని చెప్పాడు. ‘‘దృశ్యం-3 సినిమా దృశ్యం-2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు అక్షయ్ ఖన్నా ఏ రకంగా.. విగ్ పెట్టుకుంటానని డిమాండ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఎక్కడయినా రెండు నిమిషాల్లో జుట్టును మొలిపించే టెక్నాలజీ ఉందా?’’ అని పాఠక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
కష్టాల్లో మేం అవకాశమిచ్చాం
సందర్భంగానే అక్షయ్ ఖన్నా కెరీర్‌పై కూడా కుమార్ మంగత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2019లో వచ్చిన సెక్షన్ 375, 2022లో వచ్చిన దృశ్యం-2 ముందు వరకు కూడా అక్షయ్ ఖన్నా అవకాశాల కోసం చాలా తిప్పలు పడ్డాడని గుర్తు చేశాడు. ‘‘ఒకానొక సమయంలో అక్షయ్ ఖన్నా అంటే నథింగ్. ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు. అవకాశాలు కూడా లేవు. అలాంటి సమయంలో అతడితో నేను సెక్షన్-375 సినిమా తీశా. అక్షయ్ ఖన్నా ప్రొపెషనల్‌గా ఉండడని, అతడితో వద్దని ఎంత మంది చెప్పినా.. మేము అతడితోనే సినిమా తీశాం. సెట్స్‌లో కూడా అతడు చాలా టాక్సిక్‌గా ప్రర్తించేవాడు. సెక్షన్-375 సినిమాతో ఇండస్ట్రీలో అక్షయ్‌కి మళ్లీ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2022లో దృశ్యం-2లో అతడిని క్యాస్ట్ చేశాం. ఆ సినిమా తర్వాతే అక్షయ్‌కి మంచి, పెద్ద అవకాశాలు వచ్చాయి. అంతకుముందు నాలుగు సంవత్సరాల పాటు ఇంట్లో కూర్చున్నాడు’’ అని చెప్పాడు.
సక్సెన్ తలకెక్కినట్లుంది
‘‘ఇటీవల వచ్చిన మూవీ హిట్.. అక్షయ్ ఖన్నా తలకు ఎక్కినట్లుంది. కొందరు నటులు అంతే. టైమ్ బాగలేనప్పుడు కలిసి పనిచేస్తారు. ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే.. తాము పెద్ద స్టార్స్ అన్నట్లు ఫీల్ అవుతారు. అక్షయ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అతడు కూడా తనని తాను ఓ సూపర్ స్టార్ అనుకుంటున్నాడు. దురంధర్ అతని తలకెక్కింది. దురంధర్ సినిమా తన వల్లే ఆడుతుందని కూడా మాతో అన్నాడు. దురంధర్ విషయంలో చాలా విషయాలు కలిసి వచ్చాయని అతడు అర్థం చేసుకోవాలి’’ అని కుమార్ పేర్కొన్నాడు.
ఇంకా మంచి నటుడు దొరికాడు..
‘‘ఈ సినిమా నుంచి అక్షయ్ తప్పుకుంటే ఏంటి.. అతడి స్థానంలో జైదీప్ అహ్లత్ నటిస్తున్నాడు. అసలు ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా ఉన్నాడా? లేడా? అనేది మ్యాటరే కాదు. దృశ్యం అనేది ఒక పెద్ద బ్రాండ్. దేవుడి దయ వల్ల మాకు అక్షయ్ ఖన్నా కన్నా మంచి నటుడు దొరికాడు. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే.. మాకు అక్షయ్ కన్నా మంచి వ్యక్తి దొరికాడు. జైదీప్ ‌కెరీర్‌లో ఒకటైన ఆక్రోష్ సినిమాను నేను ప్రొడ్యూస్ చేశా. కాబట్టి జైదీప్ గురించి నాకు బాగా తెలుసు’’ అని పాఠక్ అన్నాడు.

Read Also: ప్రభాస్ మీద నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>