కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పంతగుల సందడి మొదలైంది. కైట్ పోటీల్లో భాగంగా చాలామంది చైనా మాంజాను (Manja) వినియోగిస్తున్నారు. గాలిలో పంతగులను తెంచేయడం కోసం మాంజాను వాడుతున్నారు. దీంతో కంటికి కనిపించని దారం మనుషుల ప్రాణాలను తీస్తోంది. తీవ్ర గాయాలపాలు చేస్తోంది. చైనా మాంజాపై పోలీసులు నిషేధం విధించినా వాడకం తగ్గడం లేదు. గాజు, నైలాన్‌తో తయారయ్యే హానికరమైన దారం ఇది. చాలా పదునుగా ఉంటుంది. మనుషులతోపాటు పక్షులు, జంతువులను తీవ్ర గాయాలపాలు చేస్తుంది. పండుగ సమయంలో మరణాల ఘటనలు జరుగుతుండటంతో సంక్రాంతి (Sankrati) సంబురాలను విషాదంగా మార్చేస్తున్నాయి.
గాలి పటాలు ఎగురవేసే సమయంలో మాంజా గొంతు, చేతులు, కళ్లకు లోతైన గాయాలను చేస్తుంది. దేశవ్యాప్తంగా చైనా మంజా వాడకం, అమ్మకం నిషేధం ఉంది. పట్టుబడితే జరిమానాలు ఇతర చట్టపరమైన చర్యలు ఉన్నాయి. అయినా చాలామంది పోటీపడి మరీ మాంజాతో గాలిపటాలను (Kites) ఎగుర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
- రోడ్లు, టెర్రస్‌లపై అప్రమత్తంగా ఉండాలి.
- కంటికి కనిపించని దారాలు ఉంటాయి. కాబట్టి పరుగెత్తడం లేదా అజాగ్రత్తగా నడవడం చేయొద్దు.
- పండుగ సమయంలో పిల్లలు బయట ఆడొద్దు.
- ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
- మెడను కప్పేలా స్కార్ఫ్ లేదా నెక్ గార్డ్ వేసుకోవాలి.
- కళ్లకు రక్షణగా గాగుల్స్ వాడాలి.
- రోడ్డు మీద వేలాడుతున్న దారాలు కనిపిస్తే దూరంగా ఉండాలి.
- గాయం అయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి.
మచ్చుకు కొన్ని
- కీసరకు చెందిన జశ్వంత్ రెడ్డి పొలం పనులకు వెళ్తుండగా మెడకు మాంజా (Manja) దారం చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అతనికి 19 కుట్లు పడ్డాయి.
- ఈ ఏడాది సంక్రాంతి సమయంలో మాంజా తగిలి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. అందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ సైతం ఉన్నాడు.
- భద్రాద్రి కొత్తగూడెంలో ఓ వాహనదారుడి మెడకు మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి.
- అలాగే పలు జిల్లాలో ప్రమాదకర మాంజా కేసులు నమోదయ్యాయి.
Read Also: గూగుల్ అదిరిపోయే ఫీచర్.. ఇక లైవ్‌లోనే ట్రాన్స్‌లేషన్
Follow Us On: Instagram


