epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ జోష్.. రాజ్యసభలో పెరగనున్న బలం

కలం, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్, స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ నెక్ట్స్ రాజ్యసభ తన బలం పెంచుకోబోతుందా? త్వరలో ఖాళీకానున్న ఓ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోబోతుందా? అంటే ఔననే చెప్పక తప్పదు. ప్రస్తుతం తెలంగాణకు మొత్తం 7 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అభిషేక్ సింఘ్వీ, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డి. దామోదర్ రావు, కే. ఆర్. సురేశ్ రెడ్డి ప్రాధాన్యం వహిస్తున్నారు. అయితే రాజ్యసభ సమీకరణాల ప్రకారం.. ఏప్రిల్ నాటికి కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్‌ సింఘ్వీ పదవీకాలం ముగియనుంది. తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా చూస్తే కాంగ్రెస్ (Telangana Congress) గెల్చుకునే అవకాశాలున్నాయి. ఎవరికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలనేది ఏఐసీసీ ఖరారు చేస్తుంది.

బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభ (Rajya Sabha)లో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనున్నది. అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 67. బీఆర్ఎస్ తరఫున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. అలాగే సీపీఐ-కాంగ్రెస్ పొత్తుతో గెలిచిన ఎమ్మెల్యే సహజంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నారు. ఇక బీఆర్ఎస్‌కు కేవలం 37 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగూ ‘విప్’ జారీ చేసే అవకాశం లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటర్లుగానే ఉంటారు. వారి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసుకోవచ్చు. ఏ పార్టీకి ఓటు వేసినా డిస్‌క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. దీంతో ఈ పదిమంది ఓట్లు ఎటు పడతాయనేది ఆసక్తికరం. బీఆర్ఎస్‌కు పడతాయనే భరోసా లేదు. దీంతో రెండు స్థానాలూ కాంగ్రెస్ వశం అయ్యే అవకాశమున్నది.

ఒక్కో రాజ్యసభ సభ్యుడికి ప్రస్తుత లెక్కల ప్రకారం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీకి (Telangana Congress) ఎలాగూ 68 (సీపీఐ కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీగా మజ్లిస్ (ఈ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు) సహకరించే అవకాశమున్నది. బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా సహకరించే అవకాశమున్నది. దీంతో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలనూ గెల్చుకునేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. పెద్దల సభలో కాంగ్రెస్ బలం మూడు నుంచి నాలుగుకు పెరగనున్నది.

గతంలో టీఆర్ఎస్‌గా ఉన్న గులాబీ పార్టీ బీఆర్ఎస్‌గా (BRS) మారి జాతీయ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నాలు చేసింది. కానీ 2024 లోకసభ (Lok Sabha) ఎన్నికల్లో ఒక్క MP స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీకి లోక్‌సభలో వాయిస్ లేకుండాపోయింది. ఇటు పెద్దసభ (Rajya Sabha)లో బలం తగ్గిపోతూ ఉన్నది.

Read Also: కోతితో ప్రయోగం చేస్తున్న మురుగదాస్..!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>