కలం వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ (Murugadoss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..గతంలో ఇటు తమిళ్ తో పాటు తెలుగు, హిందీలో సైతం వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.. వరుస పరాజయాలు మురుగదాస్‌ని ఇబ్బందిపెడుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో (Rajinikanth) తెరకెక్కించిన “దర్బార్”, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెరకెక్కించిన “సికిందర్” వంటి సినిమాలు మురుగదాస్ కు ఆశించిన విజయాలు అందించలేదు.
తాజాగా శివ కార్తికేయన్ తో (Shiva Kartikeyan) తెరకెక్కించిన “మదరాసి ” చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. దీంతో ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఒక కోతిని మెయిన్ లీడ్ గా చేసి తన తరువాత సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు ..అయితే ఈ సినిమాను కేవలం పిల్లల కోసం తెరకెక్కిస్తున్నట్లు మురుగదాస్ (Murugadoss) ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Read Also: 2026 అక్కినేని నామ సంవత్సరం కానుందా..?
Follow Us On: Pinterest


