కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకలంటేనే (New Year Party) మందు.. విందు.. స్నేహితులతో, కుటుంబసభ్యులతో అందరూ సరదాగా గడిపే క్షణాలు. అలా బిర్యానీ తిని సన్నిహితులతో పార్టీ చేసుకున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)లోని జగద్గిరిగుట్ట సమీపంలోని భవాని నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే పాండు(53) తన సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నాడు. అందరూ బిర్యానీ తిన్నారు. ఏమైందో తెలియదు.
ఒక్కసారిగా అంతా అస్వస్థతకు గురయ్యారు. పాండు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 15 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికి చికిత్స కొనసాగుతోంది. ఫుడ్ పాయిజన్(Food Poisoning) వల్లే ఈ ఘటన జరిగిందా? లేదా మరేదైనా కారణముందా? అనేది తేలాల్సి ఉంది. అందరితో సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు (New Year Party) చేసుకున్న పాండు అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: శృతి మించుతున్న అనసూయ.. వివాదమే కారణమా?
Follow Us On: X(Twitter)


