కలం, వెబ్ డెస్క్: నేపాల్ నూతన ప్రధానిగా (Nepal PM) బాధ్యతలు చేపట్టిన యువ నేత బాలేన్ షా (బాలేంద్ర షా) తన చర్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పదవి దక్కిన వెంటనే ఆడంబరాలకు వెళ్లడం లేదు. సామాన్య ప్రజల మధ్యకు వచ్చి నేరుగా వారితో మమేకమయ్యారు. ఎటువంటి భారీ భద్రతా వలయాలు లేకుండా వీధుల్లో కలియతిరుగుతూ, బాటసారులతో కరచాలనం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యువ ప్రధాని తీసుకున్న చొరవ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు సంకేతమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బాలేంద్ర షా (Nepal PM Balen Shah) అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖాట్మండు మేయర్‌గా తనదైన ముద్ర వేశాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై జరిగిన అణిచివేతపై విచారణకు ఆదేశించడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు నుంచి ఏడేళ్లలో రెట్టింపు చేయడం, సుమారు 12 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం వంటి లక్ష్యాలతో ప్రణాళికలను ప్రకటించారు. సామాన్య ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకు బాలేంద్ర షా ప్రాధాన్యతనిస్తున్నారు.
సామాన్యుడిలా..సెక్యూరిటీ లేకుండా వీధుల్లో తిరిగిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా
Nepal Prime Minister Balendra Shah roams the streets like a common man without security#BalenShah #NepalPM #BalendraShah #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/l6l945Tm7y— Kalam Daily (@kalamtelugu) April 10, 2026
Read Also: భార్య, పిల్లల హత్య కేసు.. భర్తతో పాటు 9 మంది అరెస్టు
Follow Us On: X(Twitter)

