అధికారులతో కలిసి యోగాసనాలు వేసిన మంత్రి సీతక్క

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ములుగు (Mulugu) జిల్లా కేంద్రంలో జరిగిన ప్రపంచ హోమియోపతి దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి మంత్రి యోగాసనాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. ‘మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ రోజూ యోగాసనాలు వేయడం అలవాటు చేసుకోవాలి’ అని సూచించారు. యోగా శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతతకూ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని(World Homeopathy Day) పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో వైద్యులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>