నీట్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే పునః పరీక్ష తేదీ ప్రకటన

కలం, వెబ్ డెస్క్: నీట్-యూజీ (NEET) 2026 పేపర్ లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరుపై అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల కారణంగా రద్దు చేసిన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా అడ్మిషన్ల షెడ్యూల్, విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ఉండేలా రానున్న 7 నుంచి 10 రోజుల్లోగా పునః పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, పారదర్శకంగా పరీక్ష (NEET) నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Read Also: నీట్ పరీక్ష రద్దు కావడం అత్యంత దురదృష్టకరం: మంత్రి రాజనర్సింహ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>