నేడు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ రెండో దశను ప్రారంభించనున్న సీఎం

కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అభివృద్ధికి దోహదం చేసే విధంగా మరో ముందడుగు పడింది. అమరావతి నిర్మాణంలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు ‘ఇ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌’ (Seed Access Road) రెండో దశను ప్రారంభించనున్నారు. అమరావతి రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు వెన్నెముకగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కారిడార్‌ను 60 మీటర్ల వెడల్పుతో, 9 లేన్లతో, 3 దశల్లో నిర్మాణం చేపట్టింది.

రాజధానిలో మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి రూ.1,519 కోట్లు వెచ్చించారు. ఇందులో భాగంగా విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని కూడా సీఎం (CM Chandrababu) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రూ.82 కోట్లతో 478 మీటర్ల పొడవైన 4 వరుసలతో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. అలాగే ఈ రోడ్డుకు ఆనుకుని అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్ల పనులు పూర్తికావడంతో సీఆర్‌డీఏ అధికారులు కార్యాలయాల తాళాలను సమర్పించనున్నారు.

ఈ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాయపూడి వరకు ప్రయాణించనున్నారు. అక్కడ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల క్వార్టర్స్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అమరావతి కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 350 కిలోమీటర్ల పొడవునా 34 ప్రధాన రహదారులను సర్కార్ నిర్మిస్తోంది. ఇందులో భాగంగా దొండపాడు వద్ద మొదలుకొని మణిపాల్ ఆసుపత్రి మీదుగా జాతీయ రహదారి-16 కలుపుతూ 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ-3 రోడ్డును రూ. 1,519 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ హైవే రూట్ లోనే విజయవాడ-మంగళగిరి సెక్షన్ వద్ద బకింగ్‌హామ్ కెనాల్‌పై 478 మీటర్ల పొడవుతో 4 లేన్ల స్టీల్ బ్రిడ్జ్ ను రూ. 82 కోట్లతో ఆధునీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>