గేటు తెరవగానే.. భార్యాభర్తలపై పిట్‌బుల్ కుక్క రాక్షస దాడి

కలం, వెబ్ డెస్క్: ఇంటి గేటు తెరవగానే.. భార్యాభర్తలపై పిట్‌బుల్ కుక్క రాక్షస దాడికి (Pitbull Dog Attack) పాల్పడింది. పంజాబ్‌లోని పాటియాలలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. కుంభార్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ డీలర్‌తో కలిసి అద్దె ఇల్లు చూసేందుకు భార్యాభర్తలు వెళ్లారు. ఇల్లు చూపించేందుకు ప్రాపర్టీ డీలర్ బయట గేటు తెరవగానే.. పిట్‌బుల్ డాగ్ భార్యాభర్తలపై ఒక్కసారిగా దాడి చేసింది. కాళ్లు, చేతులు శరీర భాగాలపై తీవ్ర దాడి చేసింది.

స్థానికులు వచ్చి కర్రలతో కొట్టి తరిమే ప్రయత్నం చేసినా.. ఆ కుక్క విడిచిపెట్టకుండా అలా చాలాసేపు కరుస్తోన్న ఉంది. చివరికి కుక్క నెత్తిపై ఒక దెబ్బ గట్టిగా వేయడంతో దంపతులను వదిలేసి లోపలికి పరుగులు తీసింది. సదరు భార్యాభర్తల శరీరమంతటా పిట్‌బుల్ డాగ్ తీవ్రంగా కరిచివేయడంతో వారికి తీవ్ర గాయాలై రక్త స్రావం జరిగింది. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబందించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>