Mobile Popup Ad
Mobile Popup Ad

ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం.. తెలుగు రాష్ట్రాలకు భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా న‌దీ జలాల అంశంపై హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో జరిగిన కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు ( KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు KRMB త్రిసభ్య కమిటీ భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాల మేరకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు ఇవ్వాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. అటు తెలంగాణకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 15 టీఎంసీలు కేటాయించారు. అయితే శ్రీశైలం నుంచి ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.  ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>