కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఫన్ అండ్ కమర్షియల్ మూవీ “మన శంకరవరప్రసాద్ గారు .. పండగకి వస్తున్నారు “.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు..ఈ సినిమాలో చిరూ కి జోడీగా నయనతార (Nayanthara) నటిస్తుంది..టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇదిలా వుంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుంటారు.. గతంలో తాను తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా అనిల్ సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు.. తాజాగా చిరూ సినిమాకు సైతం అనిల్ అదే పంథా ఉపయోగిస్తున్నారు..
తాజాగా హీరోయిన్ నయనతార (Nayanthara)తో చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో నయనతారనే అనిల్ తో స్టార్టింగ్ లో ప్రోమోషనల్ వీడియో చేశాము కదా ..ఇప్పుడేం లేదా అని ప్రశ్నిస్తుంది.. ఆ మాటలకు షాక్ అయిన అనిల్ మీరు ప్రమోషన్స్ అని ఆడగడమే పెద్ద ప్రమోషన్ అంటూ బదులిస్తాడు..మీరు జస్ట్ మన సినిమా జనవరి 12 న రిలీజ్ అవుతుందని చెప్పండి చాలు అదే పెద్ద ప్రమోషన్ అవుతుందని అనిల్ కౌంటర్ ఇస్తారు.. జనరల్ గా నయనతార మూవీ ప్రమోషన్స్ కి దూరంగా వుంటారు.. దీనితో తన నోటి నుంచి ప్రమోషన్స్ అనే మాట రావడంతో అనిల్ షాక్ అవుతారు.
Read Also: ప్రభాస్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు హీరోయిన్స్!
Follow Us On: X(Twitter)


