కలం, వెబ్ డెస్క్ : న్యూఇయర్ వేళ ఫుల్లుగా మద్యం తాగిన కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) లో పోలీసులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ యువకుడు దొరికిపోయి నానా హంగామా సృష్టించాడు. తనను వదిలేయాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. బండి లేకుండా వెళ్తే ఇంట్లో వాళ్లు తిడతారని బోరున విలపించాడు. అంతే కాకుండా బండి లేకుండా వెళ్తే ఇంట్లో కొడతారని గోడకు తలబాదుకున్నాడు.
ట్రాఫిక్ ఎస్సై కాళ్లు పట్టుకుని వదిలేయండి సార్ అంటూ బతిమిలాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. కాగా, డిసెంబర్ 31న హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) చేపట్టారు. హైదరాబాద్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి వేల మందిని పట్టుకున్నారు. కొన్ని చోట్ల మద్యం మత్తులో పోలీసులతో మందుబాబులు గొడవలకు దిగారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నాంపల్లి పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు pic.twitter.com/Fp7vs3cjxc
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2026
Read Also: డ్రగ్స్ తీసుకుని డీజే ఆపరేట్.. ఐదుగురి అరెస్ట్
Follow Us On: Sharechat


