కలం, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న పబ్బులన్నీ జనాలతో నిండిపోయాయి. అయితే ఈగల్ టీమ్ (Eagle Team) పబ్బుల్లో రాత్రి సోదాలు నిర్వహించగా సెలబ్రిటీలకు చెందిన పబ్బుల్లో డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెందిన బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్బులో, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నిర్వహిస్తున్న షెర్లాక్ పబ్.. అలాగే ఇల్యూషన్, వేవ్ పబ్బుల్లో ఐదుగురు డ్రగ్స్ తీసుకుని డీజే ఆపరేట్ చేస్తున్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ డ్రగ్స్ (Drugs) విషయంపై సదరు సెలబ్రిటీల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల నుంచే ఈగల్ టీమ్ పబ్బుల్లో, బార్ అండ్ రెస్టారెంట్లలో దాడులు నిర్వహించింది. అటు డ్రంకన్ డ్రైవ్ లోనూ చాలా మంది పట్టుబడ్డారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈగల్ టీమ్ తనిఖీలు చేస్తుందని.. కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే సీపీ సజ్జనార్ తెలిపారు.
Read Also: చికెన్ కోసం ముగ్గురిపై కత్తితో దాడి!
Follow Us On: Sharechat


