కలం, వెబ్ డెస్క్ : గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అధికారుల నిర్ల్యక్షం కారణంగా జెండా కట్టిన కర్ర విరిగిపోయింది. ఈ ఘటన నారాయణపేట (Narayanpet) జిల్లాలో చోటుచేసుకుంది. 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పాల్గొన్నారు.
పతాకావిష్కరణ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా జెండా కర్ర విరిగిపోయింది (Flag Pole Break). అక్కడే ఉన్న జనాలపై కర్ర పడడంతో ఒకరికి గాయాలయ్యాయి. మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, మంత్రి సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అధికారులు, నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కర్ర పుచ్చుపట్టి విరిగిపోయినట్లు తెలుస్తోంది. అధికారులు జెండా దిమ్మెను, కర్రను పరిశీలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే, జెండా కర్ర విరిగిపోవడంపై వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చేసిన అధికారులపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో జాతీయ జెండాకు అవమానం కలగడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నారాయణపేట జిల్లా మక్తల్ తహసిల్దార్ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో అపశృతి, మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో విరిగిన జెండా కర్ర
#RepublicdayCelebration #VakitiSrihari #Makthal #Narayanpet #kalam #Kalamdaily #Kalamtelugu pic.twitter.com/84B19YPyND— Kalam Daily (@kalamtelugu) January 26, 2026
Read Also: 29న జనగణనపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ : కవిత
Follow Us On: Sharechat


