కలం, వెబ్ డెస్క్ : రాజకీయంగా ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లు తలపడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Modi – Rahul) మధ్య అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ ఆవరణలోని ‘ప్రేరణా స్థల్’ ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికగా నిలిచింది. మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడటమే కాకుండా, కాసేపు సరదాగా ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణంగా సభా కార్యక్రమాల్లో తీవ్ర విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు దిగ్గజ నేతలు, ఇలా ఒకే ఫ్రేమ్‌లో ప్రశాంతంగా మాట్లాడుకోవడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేరణా స్థల్ వద్ద ఒకరిని ఒకరు పలకరించుకుని, చిరునవ్వుతో సంభాషించుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో నేతలు కలుసుకోవడం ప్రజాస్వామ్యంలోని ఆరోగ్యకరమైన వాతావరణానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌పై ఆ అక్షరాలుంటే అలర్ట్ అవ్వాల్సిందే!
Follow Us On: X(Twitter)

