Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌గిత్యాల‌లో కేసీఆర్ స‌భ‌.. స్థ‌ల ప‌రిశీల‌న‌లో జీవ‌న్ రెడ్డి!

క‌లం, వెబ్ డెస్క్‌: జగిత్యాల (Jagtial)లో ఏప్రిల్ 20న జ‌రుగనున్న‌ కేసీఆర్ (KCR) భారీ బ‌హిరంగ సభ కోసం బీఆర్ఎస్ నేత‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులో నిర్వ‌హించ‌నున్న ఈ స‌భ‌కు సుమారు ల‌క్ష మంది హాజ‌రు కానున్నారు. ఇదే స‌భ‌లో జ‌గిత్యాల సీనియ‌ర్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి జీవ‌న్ రెడ్డిని ఆహ్వానించ‌నున్నారు. ఈ స‌భ‌కు సంబంధించిన స్థ‌లాన్ని నేడు బీఆర్ఎస్ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ (Koppula Eshwar), ఇత‌ర నేత‌ల‌తో పాటు జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) కూడా స్థ‌ల ప‌రిశీల‌న‌కు రావ‌డం విశేషం. సభకు రానున్న ప్రజలకు చేయాల్సిన ఏర్పాట్లు, వేదిక, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. శుక్ర‌వారం జీవ‌న్ రెడ్డి ఎర్ర‌వెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు, పార్టీలో చేరిక‌, త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న‌ బ‌హిరంగ స‌భ గురించి మాట్లాడారు.

Read Also: ‘మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం’.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>