అయోధ్యపై స్కిట్.. రాహుల్ గాంధీపై కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎంపీలు పప్పు యాదవ్, అవధేశ్ యాదవ్‌ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయోధ్యలోని రామాలయంలో విరాళాలు దోచుకుంటున్నారంటూ పార్లమెంట్‌ ఆవరణలో ఇటీవల స్కిట్ చేశారు. దానిలో రాహుల్ పాల్గొని దేవుడిని అవమానించారని జగద్గురు బాలక్ దాస్ వారణాసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. దేవుడి పేరుతో ఎలా ఆలయంలో దోచుకున్నారో తెలపడమే తమ స్కిట్ ఉద్దేశమని.. దేవుడిని అవమానించలేదని స్పష్టం చేసింది.

Also Read : పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>