నందిగుండంలో వైభవంగా బోనాల జాతర

క‌లం, నిర్మ‌ల్‌: ఆషాడ మాస బోనాలు (Bonalu) పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం (Nandigundam) దుర్గామాత ఆలయంలో ఆదివారం బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బోనాల ఉత్సవాల సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>