వైజాగ్ బీచ్‌లో విషాదం.. ఇద్దరు స్నేహితులు గల్లంతు!

కలం, వెబ్ డెస్క్ : ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు జరుపుకోవాలనే ఆ ఉత్సాహం క్షణాల్లో తీరని విషాదంగా మారింది. స్నేహితుల దినోత్సవాన్ని ఆనందంగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు యువతీయువకులు అలల తాకిడికి గురై సముద్రంలో కొట్టుకుపోయారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాల్లో (Vizag Beach) ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి, రాము అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్స్ కోసం బీచ్‌కు వెళ్లారు. సముద్రం ఒడ్డున నిలబడి సరదాగా ఫొటోలు దిగుతున్న సమయంలో, ఒక్కసారిగా ఒక పెద్ద అల దూసుకొచ్చింది. ఆ అలల ఉధృతికి నీతు అనే యువతి క్షణాల్లో సముద్రంలోకి కొట్టుకుపోయింది.

ప్రమాదాన్ని గమనించిన రాము, తన స్నేహితురాలిని కాపాడేందుకు సముద్రంలోకి దూకాడు. అయితే, అలల వేగం విపరీతంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు రంగంలోకి దిగారు. గల్లంతైన నీతు, రాము కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>