కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు (Akiveedu) పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆకివీడుకు వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధనం చేశారు. మాలపేటలోని గుడి స్థలంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించగా, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (Raghu Rama Krishna Raju) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరు అడ్డొచ్చినా ఈరోజే శంకుస్థాపన చేస్తాం’ అని స్పష్టం చేశారు.
అయితే రామాలయం నిర్మాణాన్ని దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆకివీడులో (Akiveedu) ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, రఘురామ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read Also: చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?
Follow Us On: WhatsApp

