కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బుధవారం లోక్ సభలో, నేడు (గురువారం) రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కి ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో మోదీ కార్యాలయంలో ఆయన్ను రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి నారా లోకేష్, ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు (Amaravati Bill) సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని మోడీని వారు కోరారు. అలాగే, అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై ప్రధానితో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కలిసి చర్చించినట్లు వివరించారు. లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని మోడీ (PM Modi) హామీ ఇచ్చారు.
Read Also: పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టం పూర్తి.. అధికారులకు సీఎం అభినందనలు
Follow Us On: Facebook

