అశ్వారావుపేటలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ!

​కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ప్రముఖ సినీ నటుడు సుమన్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏ ఒక్క వర్గానికో పరిమితమైన నాయకుడు కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని కొనియాడారు. నాటి సామాజిక పరిస్థితుల్లో ప్రజలను ఏకం చేసి ఆయన చూపిన ధైర్యం, సాహసం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్రను నిరంతరం గుర్తుచేసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, పాపన్న గౌడ్ ఆశయ సాధనకు బడుగు బలహీన వర్గాలన్నీ ఐక్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బీఆర్ఎస్ నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>