ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్‌లో ఆందోళన!

కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)ను అడియాలా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో హుటాహుటిన షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ భద్రత నడుమ, ఎవరికీ కనిపించకుండా ఇమ్రాన్‌ను జైలు అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై పీటీఐ మద్దతు దారులు, సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి వెళ్లేలా అనుమతించాలని మే నెల నుంచి ఇస్లామాబాద్ హై కోర్టును ఇమ్రాన్‌ ఖాన్ వేడుకుంటున్నా.. ఆయన పిటిషన్లను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది.

సుప్రీం కోర్ట్ స్పందించడంతో..

హైకోర్ట్ తీర్పును ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం అత్యున్నత న్యాయ స్థానం ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతులు జారీ చేసింది. మాజీ ప్రధాని కంటి చూపు సరిగ్గా లేదని, చికిత్స చేయించకపోతే ఆయన చూపునే కోల్పోయే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతల నుంచి పలుమార్లు జైలు అధికారులకు వినతులు వెళ్లాయి. పట్టించుకోకపోవడంతో వారంతా కోర్టుల బాట పట్టారు. 190 మిలియన్ డాలర్ల విలువైన తోషిఖానా కేసులో ఇమ్రాన్‌పై నేరం రుజువు కావడంతో కోర్ట్ 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండిలోని అడియాలా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>